తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ఇటీవల అమరరాజా గ్రూప్ ప్రకటించడంతో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. జగన్ హయాంలో ఏపీ నుంచి కంపెనీలన్నీ తరలిపోతున్నాయని తెగ ఫైర్ అయ్యాయి. అమరరాజా కంపెనీ ప్రతిపక్ష టీడీపీకి చెందిన నాయకుడి కంపెనీ కావడంతో.. అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపుతోనే ఏపీ నుంచి తరిమేసిందని నానా మాటలు అన్నాయి. కట్ చేస్తే తాము ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు తాజాగా అమరరాజా గ్రూప్ ప్రకటించింది. […]