ప్రజా సమస్యలను రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తూ.. పలు కీలక చర్చల్లో పాల్గొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దూసుకుపోతున్నారు. రాజ్యసభ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ఎన్నో సార్లు రాజ్యసభకు ఎన్నికైన వారికంటే కూడా విజయసాయిరెడ్డి అనతికాలంలోనే రాజ్యసభ సెక్రటరియట్ ప్రశంసలు పొందుతున్నారు. సమస్యల ప్రస్తావనలో తనకున్న అవకాశాలను చక్కగా వినియోగించుకున్నట్లు బుధవారం విడుదలైన సెక్రటేరియట్ బులిటెన్లో వెల్లడైంది. రాజ్యసభలో 155 మంది సభ్యులు […]