ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి, మహ్మద్ అలీ ఖాన్ (కాంగ్రెస్) తోటసీతారామలక్ష్మి (టీడీపీ), కేశవరావు (టీఆర్ఎస్)ల పదవీ కాలం గురువారం(ఏప్రిల్9)తో ముగిసింది. సాధారణంగా ఆరేళ్లు రాజ్యసభలో సేవలందించినందుకు గాను సభ కృతజ్ఞతలు తెలపడంతోపాటు ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం జరిగేది. అయితే కరోనా నేపథ్యంలో రాజ్యసభ చరిత్రలో తొలిసారి ఎలాంటి కార్యక్రమం లేకుండా వారు తమ ప్రయాణానికి ముగింపు పలకాల్సి వచ్చింది. వీరిలో కేశవరావు మాత్రమే మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మిగతా […]
ఆంధ్రప్రదేశ్ కోటాలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో అయిదుగురు సభ్యులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 151 అసెంబ్లీ స్థానాలున్న వైసిపి ఏకపక్షంగా నాలుగు రాజ్యసభ స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉండడంతో ఆపార్టీ తరుపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల అయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నత్వాని ని బరిలోకి దించింది. అయితే అనూహ్యంగా తెలుగుదేశం ఐదో అభ్యర్థిని రంగంలో దించడంతో ఏప్రిల్ 26 న […]
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎవరు వెళ్లబోతున్నారన్నది ఖాయమైంది. ఈ మేరకు నలుగురు అభ్యర్థులను వైఎస్సార్సీపీ వెల్లడించింది. ప్రస్తుతం మంత్రులుగా పని చేస్తున్న మోపీదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోష్లతోపాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ముకేష్ అంబాని ప్రతినిధి పరిమల్ నత్వానీ పేర్లను వైఎస్సార్సీపీ అధిష్టానం ప్రకటించింది. వచ్చే నెల మొదటి వారంలో రాజ్యసభలో 55 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు వెరసి మొత్తం ఆరు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో […]