రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా వైసీపీ సర్కార్ ఏర్పాటుచేయతలపెట్టిన రాజధాని వికేంద్రీకరణ వ్యవహారంపై మళ్లీ కదలిక మొదలైంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు, అమరావతి జేఏసీ ప్రతినిధులు, ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై రోజు వారీ విచారణ చేపట్టాలని ఏపీ హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు మే 3వ తేదీ నుంచి విచారణ ప్రారంభిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి (ఎ.కె.గోస్వామి) వెల్లడించారు. సమగ్ర విచారణను రెండు […]