సోనియా గాంధీ అంతరంగీకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అహ్మద్ పటేల్ మరణించారు. గుజరాత్ కి చెందిన ఈ కీలక నేత సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. 71 సంవత్సరాల పటేల్ సోనియా గాంధీకి వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో రాజకీయంగా కీలక పాత్ర పోషించారు. యూపీఏ వ్యవహారాల్లో ప్రధాన భూమిక నిర్వహించారు. తెలంగాణా ఆవిర్భావం వంటి అంశాలలో ఆయన అభిప్రాయం మూలంగా మారింది. నెల రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. […]
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ వాస్నిక్ తన స్నేహితురాలు రవీనా ఖురానాను ఫైవ్ స్టార్ హోటల్లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వివాహం చేసుకున్నారు. కాగా 60 ఏళ్ల వయసులో ముకుల్ వాస్నిక్ తన చిరకాల మిత్రురాలిని వివాహమాడటం విశేషం. ఈ వివాహానికి పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ వివాహంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రాజీనామా తరువాత కాంగ్రెస్ […]
ఆదాయ పన్ను శాఖ తాజాగా జారీచేసిన నోటీసులపై కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ముఖ్య రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ స్పందించారు. 550 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి తనకు నోటీసులు అందినట్టు ఆయన ధ్రువీకరించారు. పార్టీ తరపున ఆ డబ్బు స్వీకరించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలతో బిజీగా ఉన్నానని త్వరలోనే ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై స్పందిస్తానని అహ్మద్ పటేల్ తెలిపారు. పార్లమెంటు సమావేశాల తర్వాత ఐటీ శాఖ ఎదుట […]