కరోనా కారణంగా దేశవ్యాప్తంగా కళాశాలలన్ని మూతపడ్డాయి..తిరిగి కళాశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పందించింది. కరోనా కారణంగా మూతపడిన కళాశాలలు ఆగస్టు నుండి పునఃప్రారంభమవుతాయని యూజీసీ వెల్లడించింది. కళాశాలల పునఃప్రారంభం ఎప్పుడనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది కానీ పెండింగ్ లో ఉన్న పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో మాత్రం వెల్లడించలేదు. కళాశాలల్లో కొత్తగా ప్రవేశించే నూతన విద్యార్థుల ప్రవేశాలను మాత్రం సెప్టెంబర్ నుండి మొదలుపెట్టాలని కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ […]
దశాబ్దాలుగా జూలై నుండి మొదలవుతున్న విద్యా సంవత్సరం ఇక నుండి మారిపోతుందా ? కరోనా వైరస్ దెబ్బకు మొత్తం వ్యవస్ధల్లో దాదాపు కుప్పకూలినట్లే విద్యా సంవత్సరం కూడా పూర్తిగా దెబ్బ తినేసినట్లే. కరోనా వైరస్ తీవ్రత కారణంగా దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోను విద్యా సంస్ధలను మార్చిలోనే మూసేసిన విషయం అందరికీ తెలిసిందే. మధ్యలోనే ఆగిపోయిన పదవ తరగతి పరీక్షలు ఏమవుతాయి ? ఇంటర్మీడియట్ పరీక్షల సంగతేమిటి ? ఏప్రిల్ లో మొదలవ్వాల్సిన ఇంజనీరింగ్ పరీక్షలు కూడా జరిగలేదు. […]