iDreamPost
android-app
ios-app

ఆగస్టునుండి కళాశాలలు పునఃప్రారంభం

ఆగస్టునుండి కళాశాలలు పునఃప్రారంభం

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా కళాశాలలన్ని మూతపడ్డాయి..తిరిగి కళాశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) స్పందించింది. కరోనా కారణంగా మూతపడిన కళాశాలలు ఆగస్టు నుండి పునఃప్రారంభమవుతాయని యూజీసీ వెల్లడించింది.

కళాశాలల పునఃప్రారంభం ఎప్పుడనేది యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) వెల్లడించింది కానీ పెండింగ్ లో ఉన్న పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో మాత్రం వెల్లడించలేదు. కళాశాలల్లో కొత్తగా ప్రవేశించే నూతన విద్యార్థుల ప్రవేశాలను మాత్రం సెప్టెంబర్ నుండి మొదలుపెట్టాలని కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆగస్టు నాటికి కరోనా ఉధృతి దేశంలో తగ్గకపోతే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

కరోనా కారణంగా కళాశాలల్లో తుది పరీక్షలు నిర్వహించకుండానే దేశవ్యాప్తంగా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇలా పెండింగ్ లో ఉన్న పరీక్షల గురించి మాత్రం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు.