రాజ్యాన్ని, రాజ్య ధర్మం ప్రకారం పాలించే పాలకులపై చేసే అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగానే పరిగణించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో కీలకమైన స్థానంలో ప్రజా ప్రతినిధి, ఒక రాష్ట్రానికి పాలకుడి మీద ఇష్టానుసారం ఎంత మాట వస్తే అంత మాట అని.. దానిని భావప్రకటన స్వేచ్ఛ అనుకుంటే పొరపాటే అవుతుంది. నిత్యం వివాదంలో ఉండే చిత్తూరు జిల్లా పుంగనూరు జడ్జి రామకృష్ణ మరోసారి ముఖ్యమంత్రి జగన్ మీద నోరు పారేసుకుని అడ్డంగా బుక్కయ్యారు. ఒక కీలకమైన న్యాయస్థానానికి జడ్జి గా […]