తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే వస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి తిరుగులేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ విషయం విపక్షాలకు కూడా ముందే తెలుసు. అందుకే గెలుపు కోసం కాకుండా ద్వితీయ స్థానం కోసం, గతంలో వచ్చిన ఓట్ల కంటే కాస్తయినా ఎక్కువ ఓట్లు సంపాదించడం కోసం కష్టపడ్డాయి. ఫలితం దక్కుతుందా, లేదా అనేది పక్కన బెడితే.. […]
ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చే ‘కొత్త పలుకు’ చదివిన వారెవరికైనా చంద్రబాబు మీద తెలుగుదేశం పార్టీలోని వ్యక్తుల కన్నా వేమూరి రాధాకృష్ణ (ఆర్కే)గారికే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అనిపించకమానదు. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని, రాజకీయ నాయకుల్ని ఆర్కే తన ఏబీఎన్ ఛానెల్లో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ అంటూ ఒక కార్యక్రమం చేస్తుంటారు. ఆ కార్యక్రమానికి సినిమా రంగం నుంచి సీనియర్లు ఎవరు వచ్చినా కూడా ఎలాగోలా ఎన్టీ రామారావు ప్రస్తావన తీసుకునిరావడం, ఆయన్ని […]