మాయాబజార్. ఈ పేరులోనే ఒక మేజిక్ ఉంది. దశాబ్దాలు దాటినా, తెలుగు సినిమా ఎన్ని కొత్త పుంతలు తొక్కినా స్క్రీన్ ప్లే గ్రామర్ కు తిరుగు లేని ఉదాహరణగా ఇప్పటి తరం ఫిలిం మేకర్స్ సైతం గర్వంగా చెప్పుకునే పేరిది. ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ఛానల్ మార్చకుండా అలా చూస్తుండి పోయేలా చేయడం దర్శకులు కెవి రెడ్డి ఇంద్రజాలమే. దిగ్గజాలైన నటులున్నప్పటికీ కేవలం పాత్రలు మాత్రమే కనిపించేలా చేయడం ఆయనకే చెల్లింది. అయితే ఇంతలా చరిత్రలో సువర్ణాధ్యాయం […]
1992లో చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ ఇండస్ట్రీ హిట్ దెబ్బకు ఘరానా పదం మాస్ కు త్వరగా రీచ్ అయిపోయే తారక మంత్రంగా మారింది. అంతటి సూపర్ స్టార్ కృష్ణ సైతం ‘ఘరానా అల్లుడు’ అనే సినిమా చేశారు. నాగార్జునకు ఆ టైంలో మాస్ మార్కెట్ బాగా పెరుగుతోంది. ‘శివ’ మేనియాలో చేసిన ప్రయోగాలన్నీ బెడిసి కొట్టడంతో కమర్షియల్ ఫార్ములాని నమ్ముకుని యువసామ్రాట్ చేసిన అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు, […]
బ్రతికినన్నాళ్ళు నలుగురితో మంచిగా ఉంటూ చేతనైన సాయం చేస్తూ ఉంటే మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందని చాటిన గొప్ప సినిమా ఆ నలుగురు. కామెడీ హీరోగానే ప్రేక్షకులకు దగ్గరైన రాజేంద్ర ప్రసాద్ లోని మరో ఎమోషన్ ని బయటికి తీసుకొచ్చిన అరుదైన చిత్రాల్లో ఇదీ ఒకటి. మెప్పించేలా చూపిస్తే ఎంత సందేశం ఉన్నా ఎంత సెంటిమెంట్ జొప్పించినా జనం ఆదరిస్తారని చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. పెళ్ళైన కొత్తలో దర్శకుడు మదన్ తన కెరీర్ […]
90వ దశకం ప్రారంభంలో జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవివిల తర్వాత ఆ స్థాయిలో హాస్య చిత్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. రాజేంద్రుడు గజేంద్రుడుతో మొదలైన ఈయన ప్రస్థానం ఎక్కడి దాకా వెళ్లిందంటే హీరో ఎవరో చూసుకోకుండా పోస్టర్ లో కేవలం ఎస్వికె పేరు ఉన్నందుకు ఆ సినిమాలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మాయలోడు, వినోదం లాంటి ఆణిముత్యాలు ఇప్పుడు చూసినా మనసారా నవ్వుకునేలా ఉంటాయి. అలాంటి డైరెక్టర్ ఒక ఎమోషనల్ […]
సెంటిమెంట్ కథలతో ప్రయోగాలు చేయలేం అనుకుంటాం కానీ నిజంగా అది తప్పు. రిస్క్ అని భయపడటం తప్పించి ఒకవేళ ధైర్యం చేసి ముందడుగు వేస్తే ఎలాంటి అద్భుత ఫలితం దక్కుతుందో ఋజువు చేసిన సినిమా శుభలగ్నం. 1993లో హాలీవుడ్ లో ‘ఇండీసెంట్ ప్రపోజల్’ అనే మూవీ వచ్చింది. బ్రహ్మాండంగా ఆడింది కూడా. అందులో ఒక పాయింట్ తీసుకుని రైటర్ భూపతిరాజా సౌత్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు ఒక కథ రాసుకున్నారు. ఇది ఓ సందర్భంలో విన్న […]