iDreamPost
android-app
ios-app

Aamani: విడాకులపై ఆమని స్పందన.. ‘ఆ కారణం వల్లే మేం విడిపోయాము’

  • Published Apr 28, 2024 | 3:10 PM Updated Updated Apr 28, 2024 | 3:10 PM

సీనియర్‌ హీరోయిన్‌ ఆమని తన భర్తతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తొలిసారి విడాకులపై స్పందిస్తూ.. అందుకు గల కారణాలు చెప్పుకొచ్చింది.

సీనియర్‌ హీరోయిన్‌ ఆమని తన భర్తతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తొలిసారి విడాకులపై స్పందిస్తూ.. అందుకు గల కారణాలు చెప్పుకొచ్చింది.

  • Published Apr 28, 2024 | 3:10 PMUpdated Apr 28, 2024 | 3:10 PM
Aamani: విడాకులపై ఆమని స్పందన.. ‘ఆ కారణం వల్లే మేం విడిపోయాము’

సీనియర్‌ హీరోయిన్‌ ఆమని గురించి తెలుగు పరిచయం అక్కర్లేదు. గ్లామర్‌, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి.. మెప్పించింది. ఒకప్పటి స్టార్‌ హీరోలందరితో నటించింది. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తల్లి, అత్త, పిన్ని వంటి పాత్రల్లో నటిస్తూ.. బిజీగా ఉంది. బుల్లితెర మీద కూడా తన సత్తా చాటుతోంది ఆమని. ఇక వెండి తెర మీద మంచి భార్య పాత్రల్లో నటించిన ఆమని.. నిజ జీవితంలో మాత్రం వైవాహిక బంధాన్ని నిలుపుకోలేకపోయింది. భర్త నుంచి విడాకులు తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భర్తతో విడిపోవడానికి గల కారణాలు చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..

సినిమాల్లో భార్య పాత్రల్లో ఆమని యాక్టింగ్‌ చూస్తే.. ఇలాంటి భాగస్వామి వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో మాత్రం ఆమని వైవాహిక జీవితం విఫలం అయ్యింది. సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోన్న ఆమని.. చాలా లేట్‌గా పెళ్లి చేసుకుంది. అయతే అందరూ ఆమెది ప్రేమ వివాహం అనుకుంటారు. కానీ వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. తమిళ సినిమా నిర్మాత ఖాజా మోహియుద్దీన్‌తో ఆమని పెళ్లి జరిగింది. ఇద్దరు కలుసుకుని.. ఒకరితో ఒకరు మాట్లాడుకుని.. ఇరువురి అభిప్రాయాలు కలిసిన తర్వాతే ఆమని-మోహియుద్దీన్‌ల వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం ఉన్నారు. పెళ్లి తర్వాత ఆమని సినిమాలకు దూరమైంది. అయితే ఆమె భర్తకి ఇష్టం లేకపోవడం వల్లనే ఆమని సినిమాలు మానేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది.

మధ్యమధ్యలో అడపాదడపా కొన్ని సినిమాల్లో కనిపించింది ఆమని. ఆ తర్వాత పూర్తి స్థాయిలో సినిమాల మీద దృష్టి పెట్టింది. వరుస సినిమాలు చేస్తూ.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఫుల్‌ బిజీగా మారింది. అయితే భర్త వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయారని.. వాటిని తీర్చడం కోసమే ఆమని మళ్లీ సినిమాల్లో యాక్ట్‌ చేస్తుందని… వీరి మధ్య విభేదాలు రావడానికి కూడా అదే కారణం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా వీటిపై స్పందిస్తూ.. అసలు వాస్తవాలు వెల్లడించింది ఆమని.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు సినిమాలంటే ఇష్టం, ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఒకరికొకరం సమయం ఇచ్చుకోవడం కష్టం అని భావించాము. ఇద్దరం ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చి.. విడాకులు తీసుకున్నాం. ఫ్రెండ్లీగానే విడిపోయాము. మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పటికి కూడా మేం టచ్‌లోనే ఉన్నాము.. కలుస్తాము. విడాకుల తర్వాత.. పిల్లల బాధ్యత నేనే తీసుకున్నాను. వారే నా ప్రపంచంగా బతుకుతున్నాను. ఇక సినిమాల షూటింగ్‌ల వల్ల పిల్లలతో ఎక్కువ సమయంగడపలేకపోతున్నాను. ఇదే కాస్త సమస్య’’ అని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్ల తర్వాత తొలిసారి విడాకులపై స్పందిస్తూ.. కారణాలు వివరించింది ఆమని.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş