సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి, వారికి కనీస గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 22 రకాల పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర (యమ.యస్.పి) ఇస్తుంది. మన రాష్టంలో పండిస్తున్న ప్రధాన పంటల్లో కొన్ని రకాల పంటలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్న పంటల జాబితాలో లేవు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధర ఇస్తున్న జాబితాలో లేని పంటలను పండిస్తున్న రైతులు తమ పంటలకు గిట్టుబాటు […]