40 ఏళ్ల క్రితం శంకరాభరణం మొదటి ఆటను చూసిన వాళ్లలో నేనూ ఒకడిని. అనంతపురం శాంతి టాకీస్లో ఉదయం 11.30 గంటలకు వెళ్లాను. మనసులో ఎక్కడో అనుమానం ఉంది. విశ్వనాథ్ సినిమాలంటే బాగా ఇష్టమే అయినప్పటికీ, అంతకు మునుపు కాలాంతకులు అనే ఘోరమైన సినిమా కూడా ఆయన తీసినదే. ఆ అనుభవం వల్ల కొంచెం భయంభయంగా థియేటర్లోకి వెళ్లాను. ఫ్రెండ్స్ని ఎవరిని పిలిచినా ఒక్కరు కూడా రాలేదు. పైగా నవ్వారు. శంకరాభరణమా ఎవరు హీరో అన్నారు. నాకు […]