ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం తన అభిప్రాయాని వ్యక్తం చేశారు. అసెంబ్లీ, సచివాలయాలకు వెళుతుంటే ఎక్కడో రాజస్థాన్ ఏడారిలోకి వెళుతున్నట్లుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాజధానిలోకి వెళుతుంట్లే ఏడారిలోకి వెళుతున్న భావన తనలో కలుగుతోందన్నారు. రాజధాని అంటే అందరిదీ అన్న భావన ఉండాలని స్పీకర్ తమ్మినేని అన్నారు. కానీ అమరావతితో ప్రజల్లో అలాంటి భావన రాలేదన్నారు. తనకు అమరావతి ప్రజల రాజధాని అన్న భావన కలగలేదని చెప్పారు. […]
అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ సమగ్రాభివృద్ధి, రాజధాని కోసం నియమించిన కమిటీ రిపోర్ట్ వెలువడింది. సీఎంకి తుది నివేదిక అందించిన తర్వాత కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మూడు రాజధానులు, నాలుగు రీజియన్లు ఉండాలని కమిటీ సూచించింది. అమరావతి– మంగళగిరి కాంప్లెక్స్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీ, హైకోర్ట్ బెంచ్, శాసనసభ,ఎమ్మెల్యే క్వార్టర్స్ వంటివి ఏర్పాటు చేయాలని తెలిపింది. తుళ్లూరు ప్రాంతంలో ముంపు ప్రమాదం ఉన్న చోట్ల నిర్మాణాలు నిలిపివేయాలని సూచించారు. అమరావతి రైతులకు సంబంధించి భూములు అభివృద్ధి […]
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి, నూతన ప్రభుత్వ కొత్త ఆలోచన మూడు రాజధానులపై చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి ఒక్క రాజధాని మాత్రమే ఉండాలనీ, అదీ అమరావతే కావాలని టీడీపీ నేతలు, రాజధాని ప్రాంతంలోని కొద్ది గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని, అందుకోసం ప్రభుత్వం చేస్తున్న మూడు రాజధానుల కు మద్దతుగా రాష్ట్ర ప్రజలు, టీడీపీతో సహా అన్ని రాజకీయ పార్టీల్లోని నేతలు ప్రకటనలు చేస్తున్నారు. హైకోర్టు కర్నూలులో, అసెంబ్లీ అమరావతిలో, […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాఫ్రికా మాదిరి మూడు రాజధానులు ఏర్పాటు జరగవచ్చు అంటు ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నేపధ్యంలో మరో సారి రాజధానిపై చర్చ జోరందుకుంది. అభివృద్ది వికేంద్రీకరణపై మొగ్గుచూపుతున్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని రాష్ట్రంలో అత్యధిక శాతం మంది సమర్ధిస్తుంటే అతి కొద్దిశాతం మంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరిలో ఎక్కువగా రాజధాని ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి కి భూములు ఇచ్చిన రైతులే ఉండగా, పార్టీల పరంగా చూస్తే రాజధాని వికేంద్రీకరణని తెలుగుదేశం, జనసేన , కమ్యూనిస్టులు […]