వెయ్యి రూపాయలు అప్పిచ్చిన పాపానికి.. అతని ప్రాణాలనే బలితీసుకున్నాడో వ్యక్తి. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురంలో జరిగిందది. వెంకటాద్రిపురానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాసరావు(45) మండలంలోని రావిచర్లలో ఉన్న సిమెంట్ ఇటుకరాళ్ల కంపెనీలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇంటి పనినిమిత్తం 200 సిమెంటు రాళ్లను తెచ్చుకుని ఇంటివద్ద ఉంచాడు. వాటిలో 50 రాళ్లను అదే గ్రామానికి చెందిన కూచిపూడి రంగా (30) అనే వ్యక్తి రెండు నెలల క్రితం తీసుకున్నాడు. వాటికి సంబంధించి […]