ఎన్నికల కమీషనర్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించిన విషయంలో ప్రభుత్వం తన వాదనను గట్టిగా వినిపించింది. నిమ్మగడ్డ తొలగింపుపై శనివారం హై కోర్టులో ఓ అఫిడవిట్ వేసింది. అందులో మాజీ కమీషనర్ ను తొలగింపుపై సమర్ధవంతంగా తన వాదనను వినిపించింది. రమేష్ కుమార్ ను తొలగించటం కోసమే చట్టంలో మార్పులు తెచ్చామన్న ఆరోపణలను ప్రభుత్వం కొట్టేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియ, కమీషన్లో సంస్కరణలు తేవటంలో భాగంగా అనేక చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. […]