దేశంలో మార్చి 25 నుండి కొనసాగుతున్న లాక్డౌన్ వలన రైతులు,వలస కూలీలు,తోపుడు బండ్లవారు,చిరు వ్యాపారులు చిల్లర దుకాణదారులు,భవన నిర్మాణ కార్మికులు వంటి అసంఘటిత రంగ కార్మికులు పెద్దఎత్తున ఉపాధి కోల్పోతున్నారు. దినసరి సంపాదన మీద ఆధారపడిన వారి కొనుగోలు శక్తి అమాంతం పడిపోయింది. దీంతోపాటు వ్యవసాయ,పారిశ్రామిక మరియు సేవ రంగాలలో ఉత్పత్తి నిలిచి పోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలోకి నెట్టబడింది. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) దేశ జీడీపీ వృద్ధి రేటు […]