తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకు విభేదాలు ముదిరిపాకాన పడుతునట్టు జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్ధం అవుతుంది. 1995లో ఎన్.టి.ఆర్ ను ముఖ్యమంత్రి పీఠం మీదనుండి దింపి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబు నాయుడు ఆనాటి నుండి ఎదురులేకుండా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఏకచత్రాధిపత్యం వహించారు. అయితే రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంద్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుండీ ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలకే మింగుడుపడటం లేదు. […]