కరోనా వల్ల కొనసాగుతున్న లాక్డౌన్ వల్ల విద్యా రంగం అస్తవ్యస్తంగా మారిపోయింది. దాదాపు రెండు నెలల తరగతులను విద్యార్థులు కోల్పోయారు. కొన్ని తరగతుల పరీక్షలు అసలు మొదలు కాలేదు. మరికొన్ని మద్యలో ఆగిపోయాయి. కొన్ని వాయిదా పడ్డాయి. వచ్చే సంవత్సరం తరగతులు కూడా మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆగస్టు లేదా సెప్టెంబర్లో విద్యా సంవత్సరం మొదలవుతుందని చెబుతున్నారు. అయితే కరోనా ప్రభావం తగ్గకపోతే మరిన్ని నెలలు ఆలస్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. […]