కరోనా వైరస్ సోకి దేశంలో ఒకపక్కవందలాది మంది చనిపోతుంటే.. మరోపక్క మహమ్మారి దెబ్బకు సగటు మధ్య తరగతి జీవులు ఉద్యోగాలు కోల్పోతూ బిక్కుబిక్కుమంటున్నారు. కరోనా సృష్టించిన కల్లోలంలో అనేక రంగాల్లోని పనిచేసే వారు తమ ఉపాధిని కోల్పోయారు. కొందరు తాత్కాలికంగా కోల్పోతే.. మరికొందరు శాశ్వతంగా ఉద్యోగాలను కోల్పోతున్నారు. లాక్డౌన్ ప్రభావం అసంఘటిత రంగంపై భారీగా పడింది. మార్చి ఒకటో తేదీ సమయంలో దేశంలో నిరుద్యోగం 7.91 శాతం ఉండగా.. మే 3వ తేదీ నాటికి 27.11 శాతానికి […]