స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేవియట్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్ లో కొద్దిసేపటి క్రితం విచారణ ముగిసింది. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిజ్ ఎస్.ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిజ్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలను వాయిదా వెయ్యాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనని ధర్మాసనం కొట్టిపారేసింది. […]