సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత రెగ్యులర్ రెస్ట్ తో పాటు లాక్ డౌన్ వల్ల మొత్తం కలిపి ఏకంగా ఐదు నెలల బ్రేక్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ సినిమా ఈ నెల 31న ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ టీమ్ నుంచి అఫీషియల్ గా ఈ న్యూస్ రానప్పటికీ నిప్పు లేనిదే పొగరాదు తరహాలో ప్రచారమైతే జోరుగా సాగుతోంది. దీనికి గీత గోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా […]
కరోనా లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడి వాటిలో సినిమాలు లేక హాళ్లు బోసిపోతున్నాయి కానీ మరోపక్క టీవీ ఛానల్స్ ఈ అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటున్నాయి. ఓటిటి విప్లవం ఎంత ఉన్నప్పటికీ అవి అందరికి చేరడం లేదు. సామాన్య ప్రేక్షకుడికి వినోదం అంటే ఇప్పటికీ టెలివిజన్ లేదా స్మార్ట్ ఫోన్ అంతే. ఒకవైపు సీరియల్స్ పూర్తిగా ఆగిపోవడంతో ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ కు సినిమాలు వేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. గతంలో ఉదయం 9 గంటలకు […]
కన్నడ సుందరి రష్మిక మందన్నకు టాలీవుడ్ టైం చాలా బాగుంది. పూజా హెగ్డే తర్వాత టాప్ రేస్ లో ఉన్నది తనే. ఈ ఏడాది పట్టుమని మూడు నెలలు గడవకుండానే రెండు బ్లాక్ బస్టర్స్ అందుకుంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, నితిన్ భీష్మ రెండూ ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ గా నిలవడమే కాక కలెక్షన్స్ పరంగానూ టాప్ 3లో చేరిపోయాయి. అందుకే అమ్మడి డిమాండ్ మాములుగా లేదు. తాజాగా తనకు సంబంధించిన ఒక హాట్ […]
సరిలేరు నీకెవ్వరుతో సంక్రాంతి బరిలో ఘన విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే వచ్చిన శాటిలైట్ టెలికాస్ట్ లో ఏకంగా బాహుబలి రికార్డును సొంతం చేసుకుని అభిమానులకు కిక్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా బ్రేక్ తో ఇంట్లో వాళ్ళతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ కు కొత్త కథలు వినడానికి, మిస్ అయిన సినిమాలు చూడడానికి బోలెడంత సమయం దొరుకుతోంది. కొత్త ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ పరశురామ్ లేదా […]
సంక్రాంతి పోరులో నువ్వా నేనా అనే రీతిలో తలపడిన మహేష్ బాబు, అల్లు అర్జున్ ఎట్టకేలకు భారీ వసూళ్లతో తమ యుద్ధాన్ని ముగించారు. లక్కీగా 50 రోజుల తర్వాత కరోనా ఎటాక్ అయ్యింది కానీ లేదంటే ఈ రెండు సినిమాలు చాలా నష్టపోయేవి. అయితే జనం అభిప్రాయంలో, బాక్స్ ఆఫీస్ వసూళ్ల లెక్కల్లో బన్నీ విన్నర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మాకూ నాన్ బాహుబలి రికార్డులు వచ్చాయని సరిలేరు నీకెవ్వరు టీమ్ చెప్పుకుంది కాని […]
అదేంటి థియేటర్లు మూతబడ్డాయి, ఎప్పుడో సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఇప్పుడు రికార్డులు కొట్టడం ఏంటి అనుకుంటున్నారా. విషయం వేరే ఉంది లెండి. మొన్న ఉగాది పండగ సందర్భంగా జెమినిలో సరిలేరు నీకెవ్వరు వరల్డ్ ప్రీమియర్ టెలికాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకు కొద్దిరోజుల ముందే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడంతో దీనికి రేటింగ్స్ వస్తాయా అని అనుమానపడిన వాళ్ళు లేకపోలేదు. కాని ఆ అంచనాలు పటాపంచలు చేస్తూ సరిలేరు టీవీ రేటింగ్స్ లో కొత్త […]