iDreamPost
android-app
ios-app

సూపర్ స్టార్ సినిమాలో ఉప్పీ దాదా

  • Published Apr 12, 2020 | 5:20 AM Updated Updated Apr 12, 2020 | 5:20 AM
  • Published Apr 12, 2020 | 5:20 AMUpdated Apr 12, 2020 | 5:20 AM
సూపర్ స్టార్ సినిమాలో ఉప్పీ దాదా

సరిలేరు నీకెవ్వరుతో సంక్రాంతి బరిలో ఘన విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే వచ్చిన శాటిలైట్ టెలికాస్ట్ లో ఏకంగా బాహుబలి రికార్డును సొంతం చేసుకుని అభిమానులకు కిక్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా బ్రేక్ తో ఇంట్లో వాళ్ళతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ కు కొత్త కథలు వినడానికి, మిస్ అయిన సినిమాలు చూడడానికి బోలెడంత సమయం దొరుకుతోంది. కొత్త ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ పరశురామ్ లేదా వంశీ పైడిపల్లి ఇద్దరిలో ఒకరికి అన్నది పక్కాగా ఫిక్స్ అయ్యింది. ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.

మరోవైపు నాగ చైతన్య సినిమాను వదులుకుని మరీ మహేష్ కోసమే వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టుగా టాక్ కూడా ఉంది. తాజాగా వస్తున్న మరో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. పరశురామ్ రాసుకున్న స్క్రిప్ట్ లో ఒక స్టైలిష్ విలన్ రోల్ ఒకటుందట. దానికి రెగ్యులర్ యాక్టర్స్ అయితే సూట్ అవ్వరనే ఉద్దేశంతో కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 2015లో అల్లు అర్జున్ సన్ అఫ్ సత్యమూర్తి తర్వాత ఉపేంద్ర మళ్ళీ తెలుగు తెరమీద కనిపించలేదు. అంతకు ముందు కన్యాదానం, రా, ఒకే మాట లాంటి స్ట్రెయిట్ మూవీస్ ద్వారా మనవాళ్ళకూ పరిచయమే కాని ఉప్పికి పేరు తెచ్చినవి మాత్రం ఎ, ఉపేంద్ర లాంటి డబ్బింగ్ సినిమాలే.

ఇప్పటికీ ఇక్కడ ఫాలోయింగ్ ఉందంటే అవే కారణం. మరి మహేష్ బాబు మూవీకి ఉపేంద్ర ఓకే చెప్పాడా లేదా తెలియదు కాని ప్రస్తుతానికి కరోనా వల్ల ఫోన్ లోనే ప్రాధమిక చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ని వీలైనంత త్వరగా రెడీ చేయమని అందులో తాను సూచించిన మార్పులు ఉండేలా జాగ్రత్త పడమని ఇద్దరికీ మహేష్ ఆల్రెడీ చెప్పేశాడట. ఈ లెక్కన జూలైలో షూటింగ్ మొదలుపెట్టుకున్నా వచ్చే సంక్రాంతిని మళ్ళి టార్గెట్ చేయొచ్చు. కాని అనిల్ రావిపూడి అంత ఫాస్ట్ గా ఈ ఇద్దరిలో ఎవరు ఓకే అయినా వాళ్ళు తీయగలరా అనేదే ప్రశ్న. ఈ క్వశ్చన్స్ కి చెక్ పడాలంటే ఇంకో నెల రోజులకు పైగానే ఎదురు చూడాల్సి వచ్చేలా ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet