కరోనా వైరస్ రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో పొరుగు రాష్ట్రం తమిళనాడు సాహస నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ తో తమకున్న సరిహద్దులను మూసివేసింది. రహదారులపై గోడలు నిర్మించింది. ఈ మేరకు చిత్తూరు జిల్లాతో తమకు ఉన్న మూడు సరిహద్దు రహదారులపై గోడలు నిర్మించింది. వేలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చిత్తూరు జిల్లా బోర్డర్ లోని మూడు ప్రాంతాలలో రోడ్లపై అడ్డంగా గోడ నిర్మించారు. ఈ విషయంపై చిత్తూరు జిల్లా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […]