తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పే సీనియర్ నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అనంతపురం జిల్లాలో సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తన కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినీ బాలతో సహా వైఎస్సార్సీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరడం ఖాయమైందని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే అనుచరులతో కలసి ఆమె విజయవాడకు చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో తన […]