ఎంత ఆదర్శంగా పుట్టిందో, అంత అధ్వాన్నంగా గిట్టింది జనతా పార్టీ. 1977లో అనూహ్యంగా వచ్చిపడిన లోక్ సభ ఎన్నికలు ఎదుర్కొనడానికి దేశంలోని ముఖ్య పార్టీలు భారతీయ జన సంఘ్, భారతీయ లోక్ దళ్, సంస్థాగత కాంగ్రెస్లతోపాటు మరో మూడు ఏకమయ్యాయి. మూడో ఏడాదికల్లా దేని దారి అది చూసుకున్నాయి. వీటిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కార్యకర్తల బలం ఉన్న ఒకే ఒక పార్టీ భారతీయ జన సంఘ్ (బిజెఎస్). ఇది RSS కు పొలిటికల్ ఫ్రంటల్ […]