దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలనూ కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా ప్రభుత్వాలు ముందస్తుగా అనేక క్వారంటైన్ పడకలను, ఐసోలేషన్ పడకలను సన్నద్ధం చేసుకుంటున్నాయి. ఇబ్బందులు ఉన్న చోట్ల రైల్వే సేవలను ఉపయోగించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకు రైల్వే శాఖ కూడా అనుమతి […]