తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. కరోనా వైరస్ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఎక్కువగా వ్యాపిప్తోంది. లాక్డౌన్ చేసిన తర్వాత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని సైబరాబాద్ ప్రాంతంలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. సాఫ్ట్వేర్ కంపెనీలు అధికంగా ఉండే చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజల్, […]