కరోనా వైరస్ ప్రభావం వ్యావసాయ అనుబంధ రంగాలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే పౌల్ట్రి రంగం కుదేలవగా వ్యాపారులు తీవ్ర నష్టాలపాలయ్యారు. కేజీ చికెన్ రిటైల్ మార్కెట్లో 30 రూపాయలకు కూడా విక్రయించారు. పలు ప్రాంతాల్లో ఫారాల్లోనే కొళ్లను ఉచితంగా ఇచ్చేశారు. ఈ ప్రభావం ఇతర అనుబంధ రంగాలపై పడకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఏపీలో ఆక్వా పరిశ్రమ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రధానమైనది. సముద్రతీర ప్రాంతంలోని 9 జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో రొయ్యల […]