మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్లో మార్చి 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దాంతో మరికొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలు జారీచేశారు. గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా పదో తరగతి మెరిట్ జాబితాను ప్రకటిస్తామని […]
కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా ఉధృతంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 27,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 881 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 6523 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1432 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 57 మంది మరణించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక మరణాలు, […]
మధ్యప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలకు శుభవార్త తెలిపింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను వెనక్కు రప్పించడానికి ప్రయత్నిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. దేశంలో చిక్కుకున్న మధ్యప్రదేశ్ కు చెందిన వలస కార్మికులను వెనక్కు రప్పించడానికి ఇప్పటికే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్చలు జరిపారు. తమ రాష్ట్రాలలో […]
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక మార్గం మూసుకుపోయింది. తన ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాలని గవర్నర్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ముఖ్య మంత్రి కమల్నాథ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ మేరకు పలుమార్లు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈరోజు సోమవారం 68 పేజీల సుదీర్ఘ తీర్పును వెల్లడించింది. మధ్యప్రదేశ్ లో 15 ఏళ్ల తర్వాత […]
మధ్యప్రదేశ్లో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ డ్రామాకు ఎట్టకేలకు ఈ రోజు తెరపడింది. ముఖ్యమంత్రి కమల్నాథ్ అసెంబ్లీలో బలపరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేయడంతో 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన 15 నెలలకే ముగిసింది. మళ్లీ శివరాజ్సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ కొలువుతీరనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయినా.. అవకాశాలు మాత్రం మూసుకుపోలేదని చెప్పవచ్చు. మరో ఆరు నెలల్లో మళ్లీ అధికారం చేపట్టేందుకు దారుంది. అయితే ఆ దారి.. మధ్య […]
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కి షాక్ ఇస్తూ బెంగుళూరు క్యాంపులో ఉన్న జ్యోతిరాదిత్యా సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ ప్రజాపతి నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ బలం 92 కి పడిపోయింది. సభలో ప్రస్తుత బలబలాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 22 మంది, బిజెపికి చెందిన ఒక సభ్యుడి రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించడంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య 207 కి పడిపోయింది. దీనితో ప్రస్తుత బలబలాలను […]