కుర్ర హీరో నితిన్ ఏడాదిన్నర గ్యాప్ తర్వాత భీష్మ బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. దానికి తోడు ఇదే ఏడాది పెళ్లి కూడా ఫిక్స్ అయిపోవడంతో ఆనందం రెట్టింపయ్యింది. కరోనా వల్ల వాయిదా పడినప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే కాబట్టి పర్సనల్ గా తీసుకోవడానికి ఏమి లేదు . నిజానికి నితిన్ భీష్మ ముందు వరస డిజాస్టర్స్ లో ఉన్నాడు. మార్కెట్ పరంగానూ దాని ప్రభావం కనిపించింది. ఓపెనింగ్స్ […]
భీష్మ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న నితిన్ నెక్స్ట్ రిలీజ్ రంగ్ దే కీలక భాగం షూటింగ్ బాలన్స్ ఉండగా కరోనా లాక్ డౌన్ వల్ల బ్రేక్ వేసుకుంది. యూరోప్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారు కాని ఇప్పట్లో విదేశాల్లో అనుమతులు దొరకడం కష్టంగా ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియదు. వరుణ్ తేజ్ తొలిప్రేమ, అఖిల్ మిస్టర్ మజ్నులతో ప్రేమ కథల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి దీనికి […]
కన్నడ సుందరి రష్మిక మందన్నకు టాలీవుడ్ టైం చాలా బాగుంది. పూజా హెగ్డే తర్వాత టాప్ రేస్ లో ఉన్నది తనే. ఈ ఏడాది పట్టుమని మూడు నెలలు గడవకుండానే రెండు బ్లాక్ బస్టర్స్ అందుకుంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, నితిన్ భీష్మ రెండూ ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ గా నిలవడమే కాక కలెక్షన్స్ పరంగానూ టాప్ 3లో చేరిపోయాయి. అందుకే అమ్మడి డిమాండ్ మాములుగా లేదు. తాజాగా తనకు సంబంధించిన ఒక హాట్ […]
సుమారు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని నితిన్ చేసిన భీష్మ దానికి తగ్గ అద్భుతమైన ఫలితాన్ని అందుకుంది. ఏకంగా 30 కోట్ల దాకా షేర్ వసూలు చేసి హీరోకే కాదు దర్శకుడికి కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఒకవేళ కరోనా తాకిడి లేకపోయి థియేటర్లు తెరుచుకుని ఉంటే ఫుల్ రన్ లో ఇంకో నాలుగైదు కోట్లు సులువుగా వచ్చి ఉండేవన్నది నిజం. దీని ప్రభావం ఇప్పుడు నితిన్ రాబోయే సినిమా రంగ్ దే మీద పడుతోంది. కీర్తి సురేష్ […]
భీష్మతో 2020 సంవత్సరానికి రెండో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ కరోనా వల్ల దాని ఫుల్ రన్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాడు. భారీ వసూళ్లు దక్కినప్పటికీ ఇంకో రెండు మూడు వారాలు కొనసాగే అవకాశాన్ని థియేటర్ల మూత వల్ల మిస్ చేసుకుంది. దీని తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చేస్తున్న నితిన్ అందులో కీర్తి సురేష్ తో రొమాన్స్ చేయబోతున్నాడు. నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ ఇప్పటికే యూత్ ని ఆకట్టుకుంది. […]
ఛలో రూపంలో డెబ్యూతోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకీ కుడుముల రెండో సినిమా భీష్మ కూడా అంతే స్థాయిలో హిట్ కావడంతో ఇతని ఆనందం మాములుగా లేదు. నిన్న మెగాస్టార్ స్పెషల్ గా షో వేయించుకుని మరీ సినిమా చూసి ప్రత్యేకంగా అభినందించడం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెట్టుబడి-రాబడి-టాక్ లెక్కల్లో అల వైకుంఠపురములో తర్వాత ఆ స్థాయి రెస్పాన్స్ భీష్మకే వచ్చిందన్నది ట్రేడ్ మాట. ఇదిలా ఉండగా అన్ని సవ్యంగా కుదిరితే వెంకీ […]
నిన్న తెలంగాణా ప్రభుత్వం అన్ని సినిమా థియేటర్లను మూసివేయాలని, సూపర్ మార్కెట్లు మినహాయించి మాల్స్ ని సైతం షట్ డౌన్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం తెలిసిన విషయమే. దీని ప్రభావం ఏ మేరకు ఉండబోతుందన్న విశ్లేషణలో ట్రేడ్ పండితులు బిజీగా ఉన్నారు. మొన్న శుక్రవారం రిలీజైన నాలుగైదు చిన్న సినిమాలు దీని వల్ల విపరీతంగా నష్టపోనున్నాయి. అసలే టాక్ పాజిటివ్ లేక సతమతమవుతుంటే మరో వైపు గాయం మీద కారం చల్లినట్టు వాటి అవకశాలను కరోనా […]