ప్రపంచ మొత్తం మీద ప్రతి లక్ష జనాభాకు కరోనా వల్ల మరణించిన వారి సంఖ్యతో పోల్చినప్పుడు ఇండియా పరిస్థితి మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 4.1 మరణాలు సంభవించగా ఇండియాలో ప్రతి లక్ష జనాభాకు 0.2 మరణాలు నమోదయ్యాయి. డబ్ల్యుహెచ్ఒ నివేదిక ప్రకారం వివిధ దేశాల్లో మరణాల సంఖ్య కోవిడ్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి చైనాలోని వూహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చైనాలో ఈ వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని చాలా తేలిగ్గా తీసుకున్నాయి. చైనాను దాటి బయటకు వచ్చినా కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ ప్రభావం తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలు చైనా పై గుర్రుగా ఉన్నాయి. కరోనా వైరస్, దాని ప్రభావం పై చైనా […]
గత గురువారం కరోనా బారిన పడినట్లు బ్రిటన్ ప్రధాని వెల్లడించారు. వారం రోజుల పాటు హోమ్ క్వారెంటయిన్ లో ఉంటే సరిపోతుందని బ్రిటన్ ప్రధానికి వైద్యులు సూచించిన సంగతి తెలిసిందే. కాగా వైరస్ లక్షణాలు తగ్గుముఖం పట్టకపోవడంతో మరిన్ని రోజులు క్వారెంటయిన్ లో ఉండబోతున్నట్లు బోరిస్ జాన్సన్ వీడియో సందేశం ద్వారా ప్రజలకు వివరించారు. కానీ వైరస్ లక్షణాలు తీవ్రతరం కావడంతో బ్రిటన్ ప్రధానిని వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. “నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే […]
కరోనా(కోవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే పలు దేశాలు కరోనా కారణంగా వణుకుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా, స్పెయిన్,బ్రిటన్, ఇటలీల పరిస్థితి రోజు రోజుకు దిగజరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 10,98,848కి చేరగా మరణాల సంఖ్య 58,871కు చేరుకొంది. శుక్రవారం స్పెయిన్లో 900 మందికిపైగా కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. బ్రిటన్లో ఒక్కరోజులోనే 569 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన 4వేల పడకల ఫీల్డ్ ఆసుపత్రిని ప్రారంభించింది. […]