లద్దాఖ్ సరిహద్దులలో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంగళవారం నాడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, డిఫెన్స్ స్టాఫ్ ప్రధానాధికారి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. చైనా సరిహద్దు భద్రత సమస్యపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సుదీర్ఘంగా భద్రత సమావేశం నిర్వహించిన కొద్దిసేపటికే మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లద్దాఖ్ సమీపంలో […]