ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు నేతలు ఎందుకు సమావేశమయ్యారో తెలీక తెలుగుదేశంపార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకీ ఫొటోలో ఉన్నదెవరంటే టిడిపిలోనే ఉంటూ యాక్టివ్ రాజకీయాలనుండి తప్పుకున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి. అలాగే టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సిఎం రమేష్. మూడో వ్యక్తి కడప జిల్లా పులివెందులకు చెందిన టిడిపి ఎంఎల్సీ బిటెక్ రవి. ఒకపుడు ముగ్గురు టిడిపి నేతలే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మొన్నటి ఎన్నికల తర్వాత […]