లాక్డౌన్ కారణంగా ఇళ్లలో ఉంటున్న క్రికెటర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సహచర ఆటగాళ్లతో తమ గత అనుభవాలను పంచుకుంటున్నారు. బుధవారం ఇన్స్టాగ్రామ్ లైవ్‌చాట్‌లో మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో ప్రపంచకప్-2015 అనుభవాలు పంచుకున్నాడు మహమ్మద్ షమీ. ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన 2015 వన్డే ప్రపంచకప్‌లో మోకాలి గాయంతోనే పాల్గొన్నట్లు చెప్పి భారత ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ షమీ బాంబు పేల్చాడు. ప్రపంచకప్-2015 తొలి మ్యాచ్‌లోనే నా మోకాలికి గాయమైంది. గాయం కారణంగా వచ్చిన వాపుతో నా మోకాలు, తొడ ఒకే సైజులో […]