పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు లేఖ రాశారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తన లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల ఏడాదికి సుమారు 300 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. […]