ఒకే తరహా ప్రేమ కథల మూసలో వెళ్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నాడన్న విమర్శలు ఎదుర్కుంటున్న విజయ్ దేవరకొండ ఎట్టకేలకు రూటు మార్చినట్టు ఫిలిం నగర్ టాక్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫైటర్/లైగర్ (ప్రచారంలో ఉన్న టైటిల్స్) లో హీరో పాత్ర డాన్ సెటప్ లో ఉంటుందట. అంటే తను మాఫియా లీడర్ కాకపోయినా తండ్రికి బాషా రేంజ్ లో బిల్డప్ ఉంటుందట అతనితో విభేదించి బయటికి వచ్చి తనకంటూ స్వంతంగా లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో […]
అతని సినిమాల్లో హీరో తిన్నగా ఉండడు…. బుద్ధిగా మసలుకోవడం అంటే వాడికి తెలియదు…. ‘ నోటికొచ్చినట్టు మాట్లాడతాడు, కాని అదే కరెక్ట్ అని మనతో అనిపిస్తాడు….. ఇష్టమొచ్చినట్టు కొడతాడు,మనకూ భయం వేస్తుంది తప్పు చేస్తే వాయిస్తాడని…. పిచ్చి పిచ్చి గెంతులు వేస్తాడు, కాకిగోల టైపులో పాటలు పాడతాడు, ఆ పాటలే మళ్ళి మళ్ళి వింటాం.. ఇంతకీ ఎవరా హీరో, ఏమా దర్శకుడి కథ అనుకుంటున్నారా ? ఆ హీరో, దర్శకుడు రెండు ఒక్కరే………పూరి జగన్నాథ్ పవన్ బాక్స్ […]