డిజిటల్ మహానాడు రెండో రోజు గురువారం సీనియర్ నేత పిఆర్ మోహన్ పార్టీలోని లోపాలపై దుమ్ము దులిపేశాడు. వెబినార్లో మాట్లాడిన మోహన్ పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నాడు. పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ఎన్టీయార్ పడిన కష్టాన్ని అందరికీ వివరించాడు. పనిలో పనిగా ఒకవైపు ఎన్టీయార్ ను పొగుడుతునే హఠాత్తుగా చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపాడు. చంద్రబాబు చుట్టూ సతీష్ చంద్ర, రాజమౌళి, ప్రద్యుమ్నా, శ్రీనివాస్ ఓ వలయంలాగా ఏర్పడినట్లు ఆరోపించాడు. […]