నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, నకిలీ ఆయిల్, నకిలీ ఆహార పదర్థాలు, నకిలీ స్టాంపులు.. ఒక వస్తువు బదులు అచ్చం ఇలాగే ఉండే నకిలీలు తయారు చేసి ప్రజలను మోసం చేసిన వాళ్లను ఇప్పటి వరకు చూశాం. కానీ దేశంలోనే మొదటి సారి ఓ నకిలీ వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. తమిళనాడులో ఓ యువకుడు మరో ఇద్దరితో కలిసి ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పేరిట నకిలీ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాడు. తమిళనాడులోని కడలూరు […]
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంగానూ మార్చాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. ఎఐడిఎంకె మాతృస్వామ్య అధినేత్రి జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్ ప్రాపర్టీని ‘వేద నిలయం’ స్మారక చిహ్నంగా చెయ్యడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఖర్చు అవుతుంది.కావున ఈ కోర్టు చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని మద్రాస్ హైకోర్ట్ వ్యాఖ్యానించింది.అలాగే ఆమె ఆస్తులకు వారసులుగా ఆమె మేనల్లుడు జే.దీపక్, మేనకోడలు జే.దీపను హైకోర్టు ప్రకటించింది. గత వారం తమిళనాడులోని ఎఐడిఎంకె […]
కరోనా వైరస్ నేపధ్యంలో చెన్నైలోని కోయంబేడు మార్కెట్టే తమిళనాడు కొంపముంచేస్తోందా ? ఇపుడిదే అనుమానం అందరిలోను పెద్దదైపోతోంది. ఒకపుడు చాలా తక్కువగా ఉన్న వైరస్ కేసులు ఇపుడు మొత్తం తమిళనాడును ఒక ఊపు ఊపేస్తోంది. రాష్ట్రమంతా శరవేగంగా విస్తరిస్తోంది. దాంతో ప్రభుత్వంలో టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోంది. వైరస్ వ్యాప్తిని ఎలా అరికట్టాలో అర్ధంకాక నానా అవస్తలు పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 వేలకుపైగా కేసులు నమోదవ్వటం చాలా ఆందోళనగానే ఉంది ప్రభుత్వానికి. ఒకపుడు మర్కజ్ మసీదు కేసులు […]
ఉదయం ఆంధ్రప్రదేశ్, మధ్యాహ్నం ఛత్తీస్గడ్, సాయంత్రం తమిళనాడు.. ఇలా దేశంలోని పలు రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎల్జి పాలిమర్ కంపెనీలో విష వాయువు లీకేజీ ప్రమాదంలో 11 మంది మరణించగా, వందల సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు విశాఖ ఘటన పై కేంద్ర , రాష్ట్ర […]
ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో కలకలం రేపిన సరిహద్దులు చెరిగిపోయాయి. తమిళనాడు అదికారులు 24 గంటల వ్యవధిలోనే తాము నిర్మించిన గోడలను తొలగించారు. దాంతో సమస్య సర్థుమణిగినందుకు అంతా ఊపిరిపీల్చుకున్నారు. అంతలోనే ఒడిశా సరిహద్దుల్లో గిరిజన గ్రామాల ప్రజలకు కొత్త సమస్య ముందుకురావడం విస్మయకరంగా మారుతోంది. చిత్తూరు, వెల్లూరు జిల్లాల సరిహద్దుల్లోని పలు చోట్ల తమిళనాడు ప్రభుత్వం రోడ్డుపై గోడలు నిర్మించింది. సరిహద్దుల్లో రాకపోకలు నివారించేందుకు అంతరాష్ట్ర రోడ్ల మీద కూడా అలాంటి ప్రయత్నం చేసింది. దాంతో పలువురు […]
కరోనా వైరస్ రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో పొరుగు రాష్ట్రం తమిళనాడు సాహస నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ తో తమకున్న సరిహద్దులను మూసివేసింది. రహదారులపై గోడలు నిర్మించింది. ఈ మేరకు చిత్తూరు జిల్లాతో తమకు ఉన్న మూడు సరిహద్దు రహదారులపై గోడలు నిర్మించింది. వేలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చిత్తూరు జిల్లా బోర్డర్ లోని మూడు ప్రాంతాలలో రోడ్లపై అడ్డంగా గోడ నిర్మించారు. ఈ విషయంపై చిత్తూరు జిల్లా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […]
కరోనా వల్ల చనిపోయిన వారి మృతదేహాల నుంచి రోగాలు వ్యాప్తి చెందవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా చెబుతోంది. వైరస్ బారిన పడి మరణించిన వారని ఖననం చేయడం కంటే కాల్చి వేయడమే మంచిదన్నది కూడా కేవలం అపోహ మాత్రమేనని కూడా పేర్కొంటోంది. అయినా సరే.. మన దేశంలో కొన్ని చోట్ల ప్రజలు భయాందోళనలతో కరోనా మృత దేహాలపై నిర్ధయతో వ్యవహరిస్తున్నారు. మానవత్వం లేకుండా ఖననం చేయకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం […]
అవును. ఇప్పుడు అమెరికా అష్టకష్టాల్లో ఉంది. ఆదిలో మేల్కొనకుండా చేసిన అలసత్వం వారి మెడకు చుట్టుకుంది. దాంతో ఇప్పుడు అన్ని దేశాల నుంచి మందులు, మెడికల్ కిట్ల కోసం పెద్ద స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. చివరకు వివిధ దేశాలకు వెళ్లాల్సిన వాటిని కూడా దారి మళ్లిస్తుందనే విమర్శలున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అమెరికా మీద విమర్శలు చేశాయి. చైనా నుంచి తమకు రావాల్సిన మెడికల్ కిట్లు అమెరికా తరలించుకుపోయిందని వాపోయాయి. తాజాగా వారి జాబితాలో ఇండియా […]
జగన్ కొత్తగా కాపరి బంధు పథకాన్ని తెస్తున్నాడు. ఉచితంగా గొర్రెల్ని ఇవ్వడం కంటే ఇది కొంచెం మెరుగైందే కానీ, అధికారులు దీన్ని నీరుకార్చకుండా చూసుకోవాలి. ఎందుకంటే దేశంలో గొర్రెలు-బర్రెలు పథకం అంత ప్రహసనం మరొకటి లేదు. వెనుకటికి తమిళనాడులో జయలలిత పాడి ఆవుల పథకం పెట్టింది. సొంత రాష్ట్రంలో కొనుగోలు చేస్తే ఆవులు చేతులు మారడం తప్ప పాడి అభివృద్ధి ఉండదని, పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేయాలని నిబంధన పెట్టారు. దాంతో నాటకం మొదలైంది. కుప్పం సంతకు […]