కరోనా తాకిడి అన్ని రంగాలను తల్లడిల్లిపోయేలా చేస్తోంది. వైరస్ వ్యాప్తితో విశ్వమంతా వణికిపోతున్న తరుణంలో క్రీడాలోకం కూడా కకావికలం అవుతోంది. అన్ని ఆటల్లోనూ ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. షెడ్యూల్స్ సవరించుకోవాల్సిన పరిస్థితి సర్వాత్ర ఉంది. దాంతో అన్ని ఆటలకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారుతోంది. క్రీడా ప్రపంచం ఎప్పటికి కోలుకునేది తెలియక తలలు పట్టుకుంటున్నారు. అటు క్రీడా సంఘాలు, ఇటు క్రీడాకారులు కూడా ఇదే సమస్యతో సతమతం అవుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా అభిమానించే ఆటల్లో ఫుట్ బాల్, క్రికెట్, […]