అవును. ఇప్పుడు అమెరికా అష్టకష్టాల్లో ఉంది. ఆదిలో మేల్కొనకుండా చేసిన అలసత్వం వారి మెడకు చుట్టుకుంది. దాంతో ఇప్పుడు అన్ని దేశాల నుంచి మందులు, మెడికల్ కిట్ల కోసం పెద్ద స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. చివరకు వివిధ దేశాలకు వెళ్లాల్సిన వాటిని కూడా దారి మళ్లిస్తుందనే విమర్శలున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అమెరికా మీద విమర్శలు చేశాయి. చైనా నుంచి తమకు రావాల్సిన మెడికల్ కిట్లు అమెరికా తరలించుకుపోయిందని వాపోయాయి. తాజాగా వారి జాబితాలో ఇండియా […]