తెలుగు న్యూస్ చానెళ్ల తీరు రానురాను రాజకీయ పార్టీలను మించిపోతోంది. పార్టీ నాయకుల తరహాలో న్యూస్ యాంకర్లు, అధినేతల మాదిరిగా ఆయా సంస్థల యజమానులు వ్యవహరిస్తున్నారనే విమర్శ నిజమేననిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కొన్ని చానెళ్లు వ్యవహరిస్తున్నాయి. కొన్నిసార్లు హద్దు మీరి వ్యవహరిస్తున్నాయి. అలాంటి ధోరణికి కొనసాగింపుగానే అన్నట్టుగా ఓ చిన్న ఘటనను భూతద్దంలో చూపించి, సానుభూతి పొందాలనే ప్రయత్నాలకు కూడా దిగుతున్నాయి. సహజంగా రాజకీయాల్లో గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకూ అందరి నేతలూ అదే తరహాలో […]