పత్రికలు ఎదుర్కొంటున్న కరోనా కష్టాల గురించి ఇప్పటికే ఒకసారి చెప్పుకున్నాం..! కరోనా కారణంగా కొన్ని పత్రికలు ముద్రణను తాత్కాలికంగా నిలిపివేస్తే మిగిలిన పేపర్లు పేజీల సంఖ్యను తగ్గించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పత్రికలు టాబ్లాయిడ్లను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో పత్రికా యాజమాన్యాలు ఇంకెలాంటి చర్యలు తీసుకుంటాయా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టాబ్లాయిడ్లు వీటినే మినీలు..జిల్లా ఎడిషన్లు అని పిలుస్తుంటారు. పేపర్ చదివే వారందరికీ టాబ్లాయిడ్లు […]