బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో విశాఖ నగరంలో పెరుగుతున్న కరోనా కేసులు కట్టడి చేసేందుకు జీవీఎంసీ కమిషనర్ జి.సృజన టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. నగర పరిధిలో కరోనా వ్యాప్తి చెందకుండా, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించేలా రెండు జోన్లకు ఒక మొబైల్ శాంపిల్ కలెక్షన్ టీమ్‌ని ఏర్పాటు చెయ్యాలని ఆదేశిస్తున్నారు. ఇంతలో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది… బిడ్డ ఏడుస్తున్నాడని… ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ.. నెల వయసున్న బిడ్డ సంగతే మరిచిపోయిన కమిషనర్ […]