‘‘సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు పోతాం’’ పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది. గతంలో ఆయన ఈ మాట చెప్పినప్పుడల్లా ఏదో చెబుతున్నాడులే అనుకున్నారు. కానీ చంద్రబాబు చెప్పిన మాట అక్షర సత్యమని ఈ రోజు రుజువైంది. సంక్షోభాలను చంద్రబాబు తన రాజకీయానికి అవకాశాలుగా ఎలా మలుచుకుంటారో ఆయన్ను గమనించే వారికి ఈ రోజు బోధపడింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. […]
ప్రభుత్వం పై ఎప్పటిలానే నిరాధార ఆరోపణలు వెనకా ముందు చూడకుండా తనకు నోటికి ఏది అనిపిస్తే అది మాట్లాడడంలో టిడిపి ఎమ్మేల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ముందుంటారు. గతంలో టిడిపి హయాంలో మంత్రిగా ఉన్నపుడు కూడా ఆయన ప్రతిపక్షం మీద ఇష్టానుసారం విరుచుకుపడేవారు.. అధికారం పోయాక కూడా కొన్నాళ్ళు అదే నోటిదురుసుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద, మంత్రుల మీద కామెంట్స్ చేసేవారు.అయితే ఆ తరువాత ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు విషయంలో ఆయన కార్మికమంత్రిగా […]
సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాది అయిపోయింది. ప్రతిపక్షం..అధికార పక్షం అయింది. అధికార పక్షం.. విపక్షం లో కూర్చుంది. అధికార వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిన టిడిపి ప్రజాప్రతినిధులకు వైసిపి అధిష్టానం ఆచితూచి జండా ఊపుతోంది. అయితే కొంతమంది పట్టువదలని విక్రమార్కుల్లా వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వైసిపి తలుపు తడుతూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన నేతల్లో ముందు వరుసలో ఉంటారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. […]