ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను క్రమంగా అమలు చేసేందుకు పూనుకుంటున్నారు. పాలనా సంస్కరణలతో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్, తాజాగా రాజధానుల విషయంలో కూడా స్పష్టతకు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మూడు రాజధానుల అంశంలో ప్రభుత్వం ముందడుగు వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖలో సెక్రటేరియేట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా వాటికి అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు సడలింపుల తర్వాత మళ్లీ […]