మల్టీ స్టారర్ ని డీల్ చేస్తున్నప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్క హీరో అభిమానుల మనోభావాలు దెబ్బ తిన్నా వాటిని ఎదురుకోవడం అంత సులభంగా ఉండదు. 1993లో అలాంటిదే జరిగింది. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున-కృష్ణ కాంబినేషన్ లో మురళీమోహన్ గారు భారీ బడ్జెట్ తో వారసుడు తీశారు. ఇది మలయాళంలో వచ్చిన పరంపర(తెలుగులో అధిపతిగా డబ్ చేశారు), హిందిలో వచ్చిన ఫూల్ ఔర్ కాంటేలకు రీమేక్ గా రూపొందింది. వారసుడులో హీరొయిన్ నగ్మా, […]
1965లో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఇద్దరు కొత్త హీరోలు, ఇద్దరు కొత్త హీరోయిన్లతో తేనె మనసులు అన్న సినిమా మొదలుపెట్టి పరిశ్రమలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటికి మంచి పేరున్న ఆదుర్తి గారు ఎవరు కావాలంటే వారితో సినిమా తీయగలిగి కొత్తవారిని ఎందుకు ఎంచుకున్నారో చాలా మందికి అర్థం కాలేదు. నటన, నృత్యంలో శిక్షణ ఇప్పించి షూటింగ్ మొదలుపెట్టారు. షూటింగ్ జరిగే కొద్దీ ఆదుర్తి గారి కొత్త హీరోల గురించి వివరాలు బయటకు రాసాగాయి. ఒక హీరోని […]
అప్పుడెప్పుడో 1974లో వచ్చిన కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు సినిమా చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేని ఆణిముత్యం. మన్నెం వీరుడిగా ఆయన్ను మురిపించే స్థాయిలో ఇంకెవరూ మెప్పించలేకపోయారు. కనీసం ఆ పాత్రను ట్రై చేద్దామని ఎన్టీఆర్ లాంటి దిగ్గజాలు సైతం ఆలోచించలేదు. అంతటి ప్రభావం చూపించిన మాస్టర్ పీస్ అది. అందులో రామరాజు ప్రియురాలిగా సీత పాత్రలో నటించిన విజయనిర్మల ఇష్టం లేని పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసుకునే సీన్ గొప్పగా పండింది. ఇప్పుడు దీనికి ఆర్ఆర్ఆర్ కి […]