ఇప్పటి తరం దర్శకుల్లో కెరీర్ మొత్తం కలిపి మహా అయితే ఓ పాతిక సినిమాలు చేయడమే గొప్ప అనుకునేలా ఉన్నాయి పరిస్థితులు. అలాంటిది ఏకంగా 140 చిత్రాలకు కెప్టెన్ గా వ్యవహరించి చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో ఆణిముత్యాలను అందించడం మాత్రం దాసరి గారికే సాధ్యమయ్యింది. మొదటి సినిమా ‘తాత మనవడు’తోనే ప్రేక్షకులను హృదయాలను గెలిచి సున్నితమైన సెంటిమెంట్ తోనే వసూళ్ల వర్షం కురిపించేలా చేసిన దాసరి గారి జన్మదినం ఈ రోజు. ప్రత్యక్షంగా మన మధ్య లేకపోయినా […]