ఏపీలో శాసనమండలి వ్యవహారాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఇటీవల జగన్ ప్రభుత్వ నిర్ణయంతో మండలి చుట్టూ మరింత చర్చ సాగుతోంది. తాజాగా ఖాళీల భర్తీ విషయంలో పెద్ద స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అందరూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయినా అధినేత మనసులో ఏముందనే విషయం అంతుబట్టక సతమతం అవుతున్నారు. ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో నాలుగు ఖాళీలున్నాయి. వాటిలో ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామా కారణంగా […]