ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్డౌన్ వల్ల ఉపాధి లేక రాజస్తాన్ నుంచి ఉత్తర ప్రదేశ్కు వలసకూలీలు నడకన బయలుదేరారు. మధ్యలో ఓ ట్రక్కు డ్రైవర్ వీరికి సహాయం చేశారు. వలసకూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు ఉత్తరప్రదేశ్ ఔరాయ జాతీయ రహదారిపై వేగంగా వెళుతు ఎదురుగా వస్తున్న మరో ట్రక్కును ఈ రోజు శనివారం తెల్లవారుజామున ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది క్షతగాత్రులయ్యారు. వీరిని పోలీసులు […]
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (80) బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను లక్నో నగరంలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆయన ఉదరకోశ సమస్య, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని చికిత్స తర్వాత కోలుకున్నట్లు మేదాంత ఆసుపత్రి డైరెక్టరు,డాక్టర్ రాకేష్ కపూర్ తెలిపారు. అనారోగ్యముతో బాధపడుతున్న ములాయంకు అన్ని రకాల వైద్యపరీక్షలు చేశామని డాక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు. ప్రస్తుతం ములాయం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, […]